గిరిజన మాలిష్ లను ప్రభుత్వ గ్రామ డేటా వెబ్సైట్ నుండి తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి!

*గిరిజన మాలిష్ లను ప్రభుత్వ గ్రామ డేటా వెబ్సైట్ నుండి తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, శ్రీ రాములు

అరకు నియోజకవర్గం: ప్రభుత్వ వెబ్ సైట్ లో మాలిష్ (ఎస్ టి )లను చేర్పించే చర్యలను ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, మాదాల శ్రీ రాములు, మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరకు వేలి మండలంలో సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో.. మాది వలస గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమై మాలి ష్ వెబ్ సైట్ నుండి తొలగించిన విషయమై ముందుగా చర్చించారు. అనంతరం ఈ సందర్భంగానే జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏజెన్సీలోని మాలిష్ ఎస్టీలకు ప్రభుత్వ వెబ్ సైట్ నుండి తొలగించి నెల రోజులు గడిచినా.. తిరిగి ప్రభుత్వ వెబ్సైట్ల లో పొందు పరుచుటకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తక్షణమే మాలిష్ గిరిజనులకు ప్రభుత్వ వెబ్ సైట్ నుండి తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని.. సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో గిరిజన వాల్మీకి భగత తెగలను వెబ్ సైట్ నుండి తొలగించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేక పోవడంతో ఇప్పుడు మా లిస్టులను ప్రభుత్వ వెబ్సైట్ ఎస్టీ జాబితా నుండి తొలగించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలో గల ముంచింగిపుట్టు, డుంబ్రిగూడ, అరకు వేలి మండలాలలో వేలాది మంది గిరిజనులు జీవిస్తున్నారు. అయితే గత నెలరోజులుగా గ్రామ వాలంటీర్ పెన్షన్ డేటా మరియు మ్యాపింగ్లో గిరిజన ఎస్టీలుగా మాలిష్లను తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాలకు దూరం అవుతామని భయాందోళనలకు గురవుతున్నారు. ఒకపక్క గ్రామ వాలంటరీ పెన్షన్ మ్యాపింగ్ లో ఎస్టీలుగా లేనందున పెన్షన్ తొలగిస్తారని తీవ్రమైన భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్లం రామకృష్ణ, మత్స్య రాజు, గతుం లక్ష్మణరావు అధిక సంఖ్య తో గ్రామస్తులు పాల్గొన్నారు.