పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలి

గూడూరు: జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో అధికార వైస్సార్సీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబంపై చేసిన అనుచిత పోస్ట్లు& వ్యాఖ్యలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని గూడూరు జనసేన నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వైఫల్యాల మీద సహేతుకమైన విమర్శలు చేసినప్పుడల్లా వాటికి సమాధానం చెప్పలేని వైసిపి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం పరిపాటి అయిపోయింది. తాజాగా మరోసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలోని స్త్రీలను టార్గెట్ చేసి దుర్భాషలు మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజు వర్రా రవీంద్రరెడ్డి అనబడే కుసంస్కారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టింగులు సభ్య సమాజం తలదించుకొనేలా ఉన్నాయి. శాంతిభద్రతలు కాపాడవలసిన గురుతర బాధ్యతలో ఉన్న మీరు సదరు అసాంఘిక వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మహిళల గౌరవాన్ని, ప్రజల హక్కులను కాపాడవలసిందిగా కోరుచున్నామని, కంప్లైంట్ ఇచ్చి అతని మీద ఎఫ్.ఐ.ఆర్ వేయవలసిందిగా ఇనెస్పెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ రావు, పట్టణ అద్యక్షులు ఇంద్రవర్ధన్ కార్యదర్శులు విష్ణు వర్ధన్, వంశీ, సనత్, రాకేష్, సూర్య, సంతోష్, రాకేష్ శంకర్, మోహన్, సాయి, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.