పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలి

  • పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించడం నీచనీయం.. రాజంపేట జనసేన

రాజంపేట: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలను వేదికగా చేసుకుని పోస్టులు పెడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాజంపేట జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన నేతలు శనివారం డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పల జ్యోతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో పాటు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అవమానపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ క్రైమ్ యాక్ట్ కింద అతని ట్విట్టర్ ఖాతాను వెంటనే తొలగించి పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా డిఎస్పి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, జనసేన నేత భాస్కర్ పంతులు, వెంకటయ్య, రాజంపేట జనసేన యువనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, జెడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు.