మాటలు కాదు ఆచరణ ముఖ్యం

జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాటిని పాటించడమే విస్వాసం తప్ప పదే పదే సీఎం.. సీఎం అని తన పేరుని జపించడం కాదు..ఆయన చెప్పిన వాటిని పాటించకుండా సీఎం.. సీఎం అని పదే పదే ఎందుకు అరుస్తారు?

కళ్యాణ్ గారి దగ్గరకు ఎందరో వెళ్తున్నారు..ఆయన మాటలు వింటున్నారు..వాటిని ఆచరణలో పెట్టె వ్యక్తులు ఎలా ఉంటారో చెబుతాను చూడండి..అలాంటి విస్వాసులు నేలను లోతుగా తవ్వి , రాతిమీద పునాది వేసి, ఇల్లు కట్టుకున్న వ్యక్తిలా ఉంటారు.. వరద వచ్చినప్పుడు, పెద్ద తరంగాలు ఆ ఇంటిని ఢీకొడతాయి.. కానీ ఆ ఇల్లు కదలదు..ఆ ఇంటి నిర్మాణం చక్కగా జరిగింది కాబట్టి కెరటాలు దాన్ని ఏమీ చేయ్యలేవు..కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత కూడా వాటిని పాటించని వ్యక్తి నేల మీద పునాది వేయ్యకుండా ఇల్లు కట్టుకున్న వ్యక్తిలాంటి వారు.. ఆ ఇంటిని నదీ ప్రవాహం వచ్చి ఢీకొట్టగానే కూలిపోతుంది.. పూర్తిగా నాశనం అవుతుంది.

ఇది తెలుసుకుని, వాటిని ఆచరణలో పెట్టే వారి ప్రయాణం స్థిరంగా, ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాగుతుంది.. పై పై మాటలతో కాలం వెళ్లబుచ్చే వారికి ఎదురుదెబ్బలు తప్పవు.. అందుకే కళ్యాణ్ గారి పట్ల విస్వాసాన్ని మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలి..జనసేనతో ప్రయాణం చేయాలంటే అదే మార్గం.

గోపాలకృష్ణ
రాజేంద్రనగర్ నియోజకవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *