క్రియశీలక సభ్యత్వ నమోదు వేగవంతం చెయ్యాలి: వంపూరు గంగులయ్య

అల్లూరి జిల్లా, పాడేరు, జనసేన పార్టీ కార్యలయంలో అరకు, పాడేరు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య జనసేన మండల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ “ముఖ్యంగా క్రియశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియ వేగవంతం చెయ్యాలని ప్రతి ఒక జనసైనికులకు, వీర మహిళలకు పార్టీ బలోపేతం నిర్ణయంగా భావించి సభ్యత్వం నమోదు ప్రజల చేత చేయించాలని సమయం తక్కువ రోజులు ఉన్నందున ప్రతి ఒకరు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రములో ఉప ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పాడేరు నియోజకవర్గంలో 4 ఎంపీటీసీ స్థానాలకు జనసేన పార్టీ తరుపున పోటీచేయ్యాలని వివిధ మండల ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తూ అందరు కలసి సమిష్టిగా పనిచేయాలని, మనం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, సాలెబ్ అశోక్, మాదేలా నాగేశ్వరావు, చిన్నారావు, జి మాడుగుల మండల అధ్యక్షులు మాసడి భీమన్న, కార్యదర్శి గొంది మురళీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.