గుండ్లపల్లి జనసేన కమిటీ నియామకం

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం ఉదయం నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్ గుండ్లపల్లి గ్రామ పెద్దలు, మండల కమిటీ సభ్యులు, జనసైనికుల ఆధ్వర్యంలో గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా నక్క వెంకటేశ్వర్లు ను నియమించడం, అలాగే గ్రామ కమిటీని వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను గ్రామంలోకి బలంగా తీసుకువెళ్లాలని అలాగే అన్ని కులాలను అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్లాలని జనసైనికులు అలాగే కమిటీ వారు అందరూ పార్టీ బలోపేతం కోసమే కృషి చేయాలని పిలుపునిచ్చారు.