క్రియాశీలక సభ్యత్వం భద్రమైన భవితవ్యం: జనసేన జానీ

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి..

పాలకొండ: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నమ్మిన ప్రతి ఒక్క జనసైనికులకి అండగా ఉండేటందుకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేపట్టారు, క్రియాశీలక సభ్యత్వం భద్రమైన భవితవ్యం, ఈ మంచి అవకాశం ప్రతి ఒక్కరు వినుయోగించుకోవాలని జనసేన జానీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ అలానే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలనివ్వను” అంటే గంపగుత్తగా ఓట్లు మొత్తం జనసేనకు మాత్రమే పడేలా చూస్తాను అని అర్ధం. అంతేగాని వెధవలతో పొత్తు ఉంటుంది అని కాదు. కులాలను కలపటం కోసం ఏర్పడిన పార్టీ, ఒక కుల పార్టీతో ఎందుకు కలుస్తుంది? కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలతో విసిగిపోయి ఉంటే ఒక కుటుంబ పార్టీతో ఎలా కలుస్తుంది??. రైతుల కోసం, పేదల కోసం సొంత డబ్బు ఖర్చుచేసే నాయకుడు, పేదలను, రైతులను దోచుకునే పార్టీతో ఎన్నటికీ కలవడు. ఇది సత్యం ఓట్లు చీలనివ్వను” అనే పదానికి అర్ధం తెలియక ఈ గందరగోళం చేస్తున్నారు. 2024లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం కాయం అని జానీ తెలిపారు.