‘ఆదిపురుష్’ అప్డేట్‌.. మానవతా కోణం జోడింపుతో రావణ్ పాత్ర

ప్రభాస్ హీరోగా తన 22వ చిత్రంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా  ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాను బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ఇందులో రావణ్ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ పాత్ర పేరుని లంకేష్‌ అని కూడా ప్రకటించారు. అయితే.. ఓ ఇంటర్వ్యూలో సైఫ్‌ అలీ ఖాన్‌ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంకేష్‌ పాత్ర నెగెటివ్‌ రోల్‌ అయినప్పటికీ దర్శకుడు ఆ పాత్రకి మానవతా కోణాన్ని జోడించాడు.

లక్ష్మణుడు..సూర్పణక ముక్కు కోయడం, వంటి విషయాల్లో లంకేష్‌ మానవతా కోణాన్ని చూపించనున్నారని అన్నాడు. ఆదిపురుష్‌లో సీతగా బాలీవుడ్‌ భామ క్రితి సనన్‌ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.