రెండు డోసులూ వేసుకున్నా.. మాస్క్‌ ధరించాలి: డబ్ల్యూహెచ్‌వో

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్నా మాస్కులు తప్పనిసరి ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కేవలం టీకా మాత్రమే కరోనా వ్యాప్తిని నిరోధించలేదని.. కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది.

‘టీకా రెండు డోసులు వేసుకున్న వారు.. మాస్కులు ధరించడం కొనసాగించాలి. మేం వ్యాక్సిన్‌ వేసుకున్నాం.. ఇక మాకేమీ కాదు అనే భావన వద్దు. కేవలం టీకాలు మాత్రమే కరోనా వ్యాప్తిని నిరోధించలేవు. టీకా వేసుకున్నా.. సమూహ వ్యాప్తికి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో మాస్క్, భౌతిక దూరంతోపాటు ఇతర కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి’ అని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మరియాంజెలా సిమావో సూచించారు.