అగనంపూడి టోల్‌ గేట్‌ ను తొలగించాలి- జనసేన ధర్నా

గాజువాక, నిబంధనలకు వ్యతిరేకంగా, కాంటాక్ట్ కాలపరిమితి కూడా ముగిసినందున జివిఎంసి పరిధిలో అక్రమంగా నడుస్తున్న అగనంపూడి టోల్ ప్లాజాను వెంటనే తొలిగించాలని శనివారం టోల్ ప్లాజా వద్ద జరిగిన మహాధర్నాలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న పార్టీ పిఏసి సభ్యులు, గాజువాక నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావు అన్నారు. నగరపాలక, మున్సిపల్ పరిధిల్లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయకూడదనే నిబంధనలున్నప్పటికి ఈ టోల్ ప్లాజా నడపటం అన్యాయమని దీని వలన గాజువాకతో పాటు నగర ప్రజలందరూ ఛార్జీలు కట్టలేక తీవ్ర ఇబ్బందిలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్తస్తుతం ఎన్.హెచ్-16 పూర్తి అవటంతోపాటు (అనకాపల్లి టు ఆనందపురం)అక్కడ టోల్ ప్లాజా ఏర్పాటైనందున, నగరం ద్వారా వెళ్లే రోడ్ స్టేట్ హైవేగా మారినందున అగనంపూడి టోల్ ప్లాజా సత్వరమే తొలిగించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలు తరుపున ఉండాల్సిన స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తన స్వలాభం కొరకు టోల్ ప్లాజా కాంట్రాక్టర్ తో కుమ్మక్కయి తొలిగించుటకు మారుమాట ఆడకపోవటం దుర్మార్గమన్నారు. 20 రోజుల్లో తొలిగించుటకు ఎన్.హెచ్.ఏ.ఐ చర్యలు తీసుకోకపోతే ఇక్కడే జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు గడసాల అప్పారావు, దల్లి గోవిందరెడ్డి, తిప్పల రమణారెడ్డి, గవర సోమశేఖర్, కాదా శ్రీను, శిరసపల్లి కనకరాజు, కరణం కనకారావు, మురళీదేవి, షాలిని, రామలక్ష్మి, జ్యోతి రెడ్డి, ఆర్మీ గోవింద్, చైతన్య, చందక చిన్నారావు, సోమన్న, మూర్తి, ముసలయ్య, రేపాక నాగేశ్వరరావు అధిక సంఖ్యలో జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.