మహిళల సాధికారత కోసం ప్రముఖ కంపెనీలతో ఒప్పందం

ఏపీ ప్రభుత్వం సమాజంలోని వెనకబడిన వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మహిళలకు సహాయం అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పధకాన్నిచేపట్టింది. ఈ పధకం కింద మహిళల అభివృద్ధి కోసం ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో, అల్లాన కంపెనీలతో ఎంవోయూ చేసుకుంది ప్రభుత్వం. మహిళా సాధికారత కోసం 11 వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే వీరికి స్థిరమైన జీవనోపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే అమూల్ , హెచ్ యూ ఎల్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గేంబుల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియా, అల్లానా గ్రూపులు ప్రభుత్వంతో భాగస్వాములయ్యాయి.