వానపల్లి పాలెంలో అయితా బత్తుల ప్రచారం

కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండల వానపల్లి పాలెంలో టిడిపి, జనసేన నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అమలాపురం అసెంబ్లీ తెలుగు దేశం అభ్యర్థి అయితాబత్తుల అనందరావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టిడిపి మాజీ కౌన్సిలర్లు ఆశెట్టి అదిబాబు, భాస్కర్ల రామకృష్ణ, టి ఎన్ టి యు సి నేత వలవల శివరావు, జనసేన నాయకులు సుదా చిన్నా, మహాదశ నాగేశ్వర రావు,పొనకల ప్రకాష్, చిక్కం సుధారాణి, చిక్కం సూర్య మోహన్, కొప్పుల బాబీ తదితరులు పాల్గొన్నారు.