ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ని జనసేనలోనికి ఆహ్వానించిన జెఎంసీ శివ

తిరుపతి జిల్లా, తిరుపతిలో అనంత వీధి నందు బలిజ సేన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ని, జెఎంసీ శివ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తిరుపతిలో పలు సమస్యలపై మరియు పలు అభివృద్ధి పనులపై మాట్లాడిన తర్వాత నేను తప్పకుండా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తిరుపతిలో ఇంతకు మునుపు ఎవరు జనసేన పార్టీలోకి నన్ను ఆహ్వానించలేదు కనుక నేను బలిజ కమ్యూనిటీకి మరియు పేదలకు సహాయం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. శివ మాట్లాడుతూ ఇకపై అందరూ కలిసి పని చేయాలని మీ సహాయం మాకు కావాలని కోరడం జరిగింది మరియు జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కృష్ణ ప్రసాద్ సానుకూలంగా అందించడం జరిగింది. ఇక తిరుపతిలో జనసేన విజయానికి తిరుగులేదు అని ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ చెప్పడం జరిగింది. ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ని కలవడానికి ముఖ్య కారణం శ్రీ గౌరవనీయులు శ్రీమతి లక్ష్మీ తిరుపతి ఉపాధ్యక్షురాలు, మరియు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ మెంబర్ రమేష్ బాబు మారసాని.