అయ్యగారే నంబర్ వన్ దోపిడీలో.. అవినీతిలో

నెల్లూరు: ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటే మంచి పరిపాలన అందిస్తారని ప్రజల అధికారం ఇస్తే గొర్రెల కాపరిలా వ్యవహరిస్తున్నాడు.. జగన్మోహన్ రెడ్డి.. అంటూ జనసేన నాయకులు నెల్లూరు సిటీ వి ఆర్ సి సెంటర్ నందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు గొర్రెలు కాదు ప్రతిసారి చెప్పింది మీరు చెప్పింది వినడానికి ప్రజలు అంతా గమనిస్తున్నారు మీరు తప్పిన మాటల్ని చేతకాని మీ పరిపాలన విధానాన్ని.. నెల్లూరులో దశాబ్ద కాలంగా ఒకే ప్రభుత్వం చినుకు పడిందంటే అయ్యప్ప గుడి సెంటర్ వరకు అనేక గోతులు ఇప్పటికే రిపేరు కు నోచుకోలేక ప్రజలు వద్ద ఇబ్బందులు పడుతున్నారు. ఒక అరగంట వాన పడితే నెల్లూరు బిట్ వన్ నుంచి బిట్ 2 కు వెళ్లలేని పరిస్థితి.. ఒక్క ఫ్లైఓవర్ కూడా నుంచి బిట్టుకు నిర్మాణం చేతకాని ఈ ప్రభుత్వం మాటలతోనే ఊరుకుండిపోయింది. చదువుకున్న యువతకు జాబ్ కేలండర్ రిలీజ్ చేయకపోయినా అయ్యగారే నెంబర్ వన్. సిపిఎస్ రద్దు చేయకపోయినా జీతాలు సమయానికి ఇవ్వలేకపోయినా అయ్యగారే నెంబర్ వన్. వృద్దుల పదవీ విరమణ పెన్షన్ లో సైతం కోతలు విధిస్తున్నా అయ్యగారే నెంబర్ వన్, తుఫాను బాధిత అన్నదాతలకు నష్టపరిహారం అందించలేక పోయారు. అయినా అయ్యగారే నెంబర్ వన్ అలాగే వరద బాధితులకు తక్షణ తుఫాను బాధితులకు తక్షణ సహాయం కింద అందించాల్సిన పరిహారం లేదు అయినా కానీ అయ్యగారే నంబర్ వన్ అనే విధంగా జనసేన జగనన్న భక్తులు ప్రచారం చేస్తున్నారు. నిజంగా అయ్యగారే నంబర్ వన్.. అవినీతిలో నంబర్ వన్ దురాక్రమణ దోపిడీలో నెంబర్ వన్ దౌర్జన్యాలలో నెంబర్ వన్ ప్రతిపక్షాలపై కేసులు పెట్టడాలు నెంబర్ వన్ అనిపిస్తుంది.. అక్రమంగా సహజ వనరులు దోపిడీకి గురి అవుతున్నాయి సైదాపురంలో అయితే ఏమి ఇసుక అక్రమ తవ్వక రవాణాల్లో అయితే గాని అధికారులు చూస్తుండి పోతున్నారు. మా నాయకులు అడ్డాలు అనుమతులు లేకుండా ఎలా ఇస్తారు అని ప్రశ్నించిన అధికారులు ఈ రోజు అనుమతులు లేకుండా వివాదాస్పదమైన ఫ్లెక్సీలు వేస్తుంటే ఎందుకు చూస్తుంది పోయారు. ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన ఉద్యోకు మంచి భవిష్యత్తు ఉంది.. నాయకుల మాటలు విని వారు చెప్పినట్లు చేస్తే రేపు ఉదయం మీరు దానికి భాద్యులు అవుతారు. అక్రమ సహజ వనరులు దోపిడీ జరుగుతుందంటూ నిరసనలు వ్యక్తం చేస్తుంటే హిజ్రాల దాడి తో దాడి చేయించటం ఎంతవరకు సబబు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సుపరిపాలన అందాలనా ప్రజలకు న్యాయం జరగాలన్న రేపటి తరం బాగుపడాలన్న రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిందిగా అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన సీనియర్ నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, కాకు మురళీ రెడ్డి, వీర మహిళలు నాగరత్నం, రేణుక, నగర కార్యదర్శి హైమావతి, కృష్ణవేణి, హసీనా, భారతి, జనసైనికులు ప్రశాంత్ గౌడ్, శ్రీను, హేమచంద్ర యాదవ్, బన్నీ, వర, వర్షన్, షాజహాన్, ఖలీల్, కేశవ, శరవణ, వెంకటేష్, ఆరీఫ్, ఉమా మహేష్, కార్తికేయ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.