మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన అక్కల గాంధీ

మైలవరం నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ నందు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మైలవరం నియోజవర్గం జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం రాగానే వాటిని గాలికి వదిలేశారు. మున్సిపల్ కార్మికులకి ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఉద్యోగాలు పర్మినెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెల్త్ అలవేన్స్లు అమలు చేసి ఆరోగ్య భద్రత కల్పించాలని, మున్సిపల్ కార్మికులకు సంక్షేమం పథకాలు తక్షణమే అమలు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, సామల సుజాత, పార్ధసారధి, సి.ఐ.టి.యు మహేష్, అరిగే కళ్యాణ్, యర్రంశెట్టి సాయి, బొమ్మల రమేష్, అనం మహేష్, దూడల ఈశ్వర్, పాములపాటి గోపి, చిట్టెలు హరీష్, రాధ, హేమంత్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.