ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండించిన అళహరి సుధాకర్

కావలి, జనసేన ధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కావలి నియోజకవర్గ జనసేన ఎంపీటీసీగా పోటీచేసి చనిపోయిన బలికిరి ప్రణయ కుమార్ కు సంబంధించిన వీడియోస్ ట్విట్టర్ లో ఫేస్బుక్ లో పోస్ట్ చేసినవి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ మాట్లాడుతూ… ఈ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కావలి రూరల్ తుమ్మలపెంట బిట్-1 లో జనసేన ఎంపిటిసిగా పోటీచేసిన బలికిరి ప్రణయ కుమార్ తల్లికి చనిపోయిన క్రియాశీల కార్యకర్తకు పార్టీ తరుపున 5లక్షలు పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఇస్తున్న సందర్భంగా ఆవిడ ఎలక్షన్స్ టైమ్ లో ప్రణయ చేసిన వీడియో చూపిస్తూ ఆ తల్లి మా అబ్బాయిని ఆ పోటీ నుండి తప్పుకోవాలని అనేక విధాల సుకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ మనుషులు వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని, మా అబ్బాయిని వైసిపి వాళ్ళే చంపేశారని ఆవిడకు ఉన్న అనుమానాన్ని, ఆవేదనని ఆవిడ వ్యక్తిగతంగా వ్యక్త పరుస్తూ రోధిస్తే పవన్ కళ్యాణ్ స్పందించి కేవలం వారి వీడియోస్ ను పోస్ట్ చేస్తూ అతని పేరు, చదువు, కులము, వృత్తి మరియు అతను జనసేన ఎంపిటిసిగా పోటీ చేశారని మాత్రమే అక్కడ తెలపడం జరిగింది. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకున్నట్లు నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడు ఎవడో కూడా మాకు తెలియదు. ఆటోతో బస్సుకు గుద్ది చనిపోయాడని, కావలి ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రాంతము ఇలాంటి హత్యలు మేము చెయ్యము, జనసేన పార్టీనే మేము లేక్క చేయట్లేదు అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని. ఎంపిటిసిగా పోటీ చేస్తే అతని ఇంటిమీదకు పోయి బెదిరించినది వాస్తవము కదా అని, మా నాయకుడు ప్రజల పక్షాన ఉండే ఏకైక ప్రతిపక్షంగా స్పందిస్తూ అనేక కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుంటే మొట్టమొదట మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేలేది మీ వైసిపి నాయకులు కాదా, అధికారంలో ఉన్న పార్టీ కి జనసేన అంటే టన్నులకొద్ది భయము ఉండబట్టే ఈ మధ్య ఎక్కువగా జగన్ రెడ్డి నుండి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా మా పార్టీ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి జనసేన పార్టీ కావలి నియోజవర్గ ఇంఛార్జిగా పార్టీ తరుపున తెలియపర్చడం ఏమనగా మీరు ఎమ్మెల్యే ఉన్న ఎనిమిదిన్నర ఏళ్లుగా కావలిలో ఏమి చేసారో శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే జనసేన సోషల్ ఆడిట్ ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం. #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేసి ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిస్తామని ఈ సందర్భంగా జనసేన కావలి నియోజకవర్గ ఇంచార్జ్ అళహరి సుధాకర తెలిపారు.