ఆలమూరు గ్రామ జనసేన అధ్యక్షులు కట్టా రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలానికి చెందిన, ఆలమూరు గ్రామవాసి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, శెట్టిబలిజ యువ నాయకులు కట్టా రాజుకు మంగళవారం పుట్టినరోజు అని, కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఎంతో ఆత్మీయతతో శుభాకాంక్షలు అందజేశారు. తన నియోజకవర్గంలోని గ్రామ నాయకులను, మండల నాయకులను, జన సైనికులను, వీరమహిళా కార్యకర్తలను, నిరంతరం ఎంతో ఆత్మీయతతో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ జనసేన పార్టీని బలోపేతం చేస్తున్న జనసేన ప్రముఖ నాయకులు బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడం మాకు ఎంతో సంతోషదాయకం అని ఒక శెట్టిబలిజ యువనాయకుడిగా, ఎంతో అండదండలు అందిస్తూ, మా వెన్నంటే ఉంటూ, నియోజవర్గ జనసేన ఇంచార్జ్ నాయకులు బండారు శ్రీనివాస్ కు ధన్యవాదాలు అని, కట్టా రాజు ఈ సందర్భంగా తెలియజేశారు.