దోషులను పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం: త్యాడ రామకృష్ణారావు

పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్ధం కొండపై కొలువైవున్న కోదండరాముని శిరశ్ఛేదనం జరిగి నేటికీ సరిగ్గా ఏడాది అయ్యింది. ఇప్పటి వరకు వైస్సార్సీపీ ప్రభుత్వం దోషులను పట్టుకోనందుకు నిరసనగా రామతీర్ధంలో ఆనందాశ్రమమ్ స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి మౌనదీక్ష తలపెట్టితిరి.

ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ నేటికీ రామతీర్థంలో రాముల వారి శిరిచ్చేదనం జరిగి సంవత్సరం గడుస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో వందలాది దేవాలయాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినా దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, జిల్లాలో ఉపముఖ్యమంత్రి శ్రి పుష్పశ్రీవాణి, మరోమంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ఉన్నా సొంతజిల్లాలో దోషులను చేధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన దోషులను పట్టుకొని చట్టానికి అప్పజెప్పాలని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ప్రవర్తిస్తే దోషులను శిక్షించేవరకు హిందూ ధార్మిక సంస్థలతో పోరాటం చేస్తామని తెలిపారు. ఈ మౌనదీక్షకు మద్దతుగా నిలిచి, విజయనగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), నెలిమర్ల నియోజకవర్గ సీనియర్ నాయకుడు పతివాడ అచ్చుమ్ నాయుడు, దాసరి యోగేష్, రవిరాజ్ చౌదరి దీక్ష చేస్తూ నిరసన తెలిపారు.