సైనికులకు యావత్ భారతదేశం ఋణపడి ఉంటుంది: నేరేళ్ళ సురేష్

గుంటూరు, భారత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు యావత్ భారతదేశం ఋణపడి ఉంటుందని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో అశువులుబాసిన వీరాజవానులకు బుధవారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు శ్రీనివాసరావుతోటలోని రామనామక్షేత్రం వద్ద నున్న భరతమాత విగ్రహానికి పూలమాలలు వేసి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పుల్వామా దాడుల్లో మరణించిన ప్రతీ ఒక్కరూ భారతీయుల గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారన్నారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన 35 మంది జవానులకు ప్రభుత్వం, ప్రజలు అండగా నిలిచారన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంచాల్సిన అవసరం ప్రతీఒక్కరిపై ఉందని నెరేళ్ళ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు, రెల్లి యువనేత ఉదయ్ కుమార్, పులిగడ్డ గోపి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, కోలా అంజి, రామిశెట్టి శ్రీను, స్టూడియో బాలకృష్ణ, వడ్డె సుబ్బారావు, తాడికొండ శ్రీను, బాలు, విజయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.