అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

  • అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ జనసేన పోరాటం చేస్తుంది

నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు గేట్ కేపిఆర్ కళ్యాణమండపం నందు అగ్రిగోల్డ్ బాధితుల న్యాయమైన ప్రజా పోరాటాలకు మద్దతుగా నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని అఖిలపక్ష పార్టీలు జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, కాంగ్రెస్, తెలుగుదేశం, నాయకులు పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు మాట్లాడుతూ.. వారాహి యాత్ర నెల్లూరు జిల్లా ప్రవేశించిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చించి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తమ మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేశారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలియజేశారు.