ఏలూరు నియోజకవర్గ సీటు కేటాయింపుపై పునరాలోచన చేయాలి

  • 2 వ తేదీ తరువాత మనం కార్యాచరణతో ముందుకు సాగుదాం -రెడ్డి అప్పల నాయుడు..

ఏలూరు జిల్లా, ఏలూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, వీర మహిళలతో రెడ్డి అప్పలనాయుడు సమావేశం నిర్వహించి పార్టీలకోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు.. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జనసేన టిడిపి పొత్తులో భాగంగా ఏలూరు నియోజకవర్గ సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించటంతో ఏలూరు నియోజకవర్గ జనసైనికులు అసంతృప్తికి లోనయ్యారని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము జీర్ణించుకోలేక పోతున్నామని తెలిపారు..ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులతో సహా రెడ్డి అప్పల నాయుడు కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే జనసేన పార్టీ అత్యధికంగా బలంగా ఉన్న నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం అని, రాష్ట్రంలో ఎవరైనా చేయించిన సర్వేలో సైతం మొదటి స్థానంలో వచ్చిన ఏలూరును మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి కేటాయించటం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. మీ నిర్ణయం మార్చుకుని మరల ఏలూరు సీటును జనసేనకు కేటాయిస్తారని జన సైనికులు అంతా ఎదురుచూస్తున్నామని కోరారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏలూరు అసెంబ్లీ సీట్ పై పునర్ ఆలోచన చేసి మళ్లీ జనసేనకు సీటును కేటాయించేలా చేయాలని పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు నన్ను డిమాండ్ చేస్తున్నారని రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఒకవేళ జనసేన తన నిర్ణయం మార్చుకోకపోతే రెడ్డి అప్పల నాయుడు నీ ఇండిపెండెంట్గా నిలబడాలని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పలువురు కార్యకర్తలు తమ నిర్ణయాన్ని మాకు తెలియజేస్తున్నానని అన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకూడదు అని, ఒక 5 గురుతో కూడిన భవిష్యత్తు కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఐదుగురు నిర్ణయం మీదే మా కార్యచరణ ఆధారపడి ఉంటుందన్నారు. అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్న సమయంలో సైతం మా నాయకులు కార్యకర్తలు ఉద్వేగానికి లోనయ్యారని భావోద్వేగంతో తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లాల ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా,నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, మరియు భారీ సంఖ్యలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.