‘అల్లు’ స్టూడియోస్

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరు తెచ్చుకున్న నవ్వుల రారాజు అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఆయన జయంతి సందర్భముగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు సినీప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. మూడు తరాల సినీ ప్రేక్షకులను తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన అల్లు రామలింగయ్య.. మనమధ్య లేకున్నా ఆయన జ్ఙాపకాలు మాత్రం మన మధ్యే ఉన్నాయి. యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లు రామలింగయ్యను వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. రామలింగయ్య వెయ్యికి పైగా చిత్రాలను పూర్తి చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. సుమారు 1200 సినిమాల్లో నటించిన రామ లింగయ్యకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. నేడు అల్లు రామలింగయ్య జయంత్యోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు.

తన ముగ్గురు కుమారులతో కలిసి అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు. కాగా, సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ అల్లు స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.