ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. నేషనల్ హెల్త్ మిషన్‌ కింద చేపట్టనున్న ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కన్సల్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, పీడియాట్రిషయన్స్, గైనకాలజిస్టులు, బయోమెడికల్ ఇంజినీర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్.. ఇలా మొత్తం 77 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

బ్యాచిలర్స్ డిగ్రీ (మెడిసిన్‌)/ డెంటల్‌/ నర్సింగ్‌/ బీపీటీ, బయో మెడికల్ ఇంజనీరింగ్‌, మాస్టర్స్ డిగ్రీ (సోషల్ సైన్సెస్‌), పీజీ డిగ్రీ, ఎండీ లలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు తగినంత అనుభవం ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు spmuaprect@gmail.com కు మెయిల్ చేయాలి. చివరితేదీ.. అక్టోబర్ 9తో గడువు ముగియనుంది.

అధికారిక వెబ్‌సైట్ http://cfw.ap.nic.in/

అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. వయోపరిమితి విషయానికొస్తే కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లకు మించని అభ్యర్థులు ఈమెయిల్ (spmuaprect@gmail.com) ద్వారా నేషన్ హెల్త్ మిషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.