ఇన్నేసుపేటలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

  • ముఖ్య అతిథిగా హాజరైన ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం: తులసిగాం పంచాయతీ పరిదిలోని ఇన్నేసుపేట గ్రామంలో దుంగు భాస్కర రావు ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు ఆ గ్రామానికి విచ్చేసి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వ వార్డు ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర్ రావు, 11వ వార్డు ఇంచార్జ్ కలియ గౌడ్, అజయ్, ఢిల్లీ, ఆది, గ్రామ పెద్దలు ఇసురు కృష్ణారెడ్డి, గ్రామ జనసైనికులు దుంగు కుబేర్ రెడ్డి, దుంగు జగన్నాథం రెడ్డి, దుంగు దాశరధి ఇసురు ఆదినారాయణ, ఇసురు దామోదర్, ఇసురు విశ్వనాథం, రోకాళ్ళ బోగేస్, ఇసురు ఋషి, దుంగు గురుమూర్తి, రోకళ్ళ నారాయణ తదితరులు పాల్గొన్నారు.