అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం జీ వేమవరం గ్రామంలో బైర్రాజు ఫౌండేషన్ వారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా వారం రోజుల ఉత్సవాలలో భాగంగా గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జీ వేమవరం గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, గూడాల నాని, విళ్ళ వీర, సుంకర చంద్రరావు, దూడల స్వామి, మారుతూర్తి మణికంఠ, కుందు దుర్గాప్రసాద్, గండి అనిల్, నరాల శ్రీనివాసరావు, అంకన ఆంజనేయులు, మందపల్లి సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.