జనసేనపై వైసీపీ మంత్రుల విషప్రచారాన్ని సహించేది లేదు

  • జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, జనసేన పార్టీని ఒక కులానికే పరిమితం చేసే విధంగా వైసీపీ మంత్రులు చేస్తున్న విషప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రజలెవ్వరూ వైసీపీ నేతలు చెప్పేవాటిని విశ్వసించడం లేదని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ప్లీనరీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ పై , జనసేన పార్టీపై వైసీపీ నాయకులు అంబటి, పేర్ని నానిలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు మంచిబుద్ది ప్రసాదించమని శ్రీనివాసరావుతోటలోని స్వతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ నిర్వహిస్తోంది ప్లీనరీ సమావేశాలా లేక పవన్ కళ్యాణ్ ని విమర్శించటానికి ఏర్పాటు చేసుకున్న వేదికలా అని విమర్శించారు. జనసేన పార్టీ మొదటి సిద్దాంతమే కులాలని కలిపే ఆలోచనా విధానమన్నారు. వైసీపీ నేతలు 2019 ఎన్నికల సమయంలో జనసేనపై పన్నిన కుట్రలే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని , అయితే ప్రజలు మీ రాక్షస నిజస్వరూపాన్ని ఈ మూడేళ్ళలో గ్రహించారన్నారని దుయ్యబట్టారు. తమకు అండగా నిలిచిన ముస్లిం మైనారిటీలను, దళితులను, బీసీలను ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధంగా మోసం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. వైసీపీ నేతలకు కళ్లు మూసినా, కళ్లు తెరిచినా పవన్ కల్యాణే కళ్ళముందు కదలాడుతున్నాడన్నారు. తమ అవినీతిని, ఆరాచకత్వాన్ని, అసమర్థతను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టి వైసీపీని దోషిగా నిలబెడుతున్నందుకే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా చైతన్యంతోనే రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవుతుందని, ప్రజలు జనసేన పార్టీ విధివిధానాల పట్ల సానుకూలంగా ఉన్నారని, రాబోయేది జనసేనేనని ఆళ్ళ హరి అన్నారు. జనసేన పార్టీ దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీని భుజస్కంధాలపై మోసిన దళితులను వైసీపీ ప్రభుత్వం నిలువెల్లా దగా చేసిందని ఆరోపించారు. దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు అమలుచేసిన 26 పధకాలనూ రద్దు చేసి దళితులకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. వైసీపీకి అండగా నిలిచి గెలిపించినందుకు దళితులపై హత్యలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ లో బాబా సాహెబ్ అంబెడ్కర్ భావజాలాన్ని గమనించే దళితులు జనసేన పార్టీలో చేరుతున్నారన్నారు. కులమతాలకతీతమైన పాలన కోసం ప్రజలు జనసేనకు పట్టం కట్టాలని కొర్రపాటి నాగేశ్వరరావు కోరారు. కార్యక్రమంలో చెన్నా పోతురాజు, కోనేటి ప్రసాద్, షర్ఫుద్దీన్, బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, దాసరి రాము, సుబ్బారావు, తోట సాంబశివరావు, శేషు, శ్రీను, కోటేశ్వరరావు, దొడ్డి కోటి, సెంట్రింగ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.