జనసేన ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం

రాజంపేట: జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో మండలంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. చల్లపల్లి శ్రీనివాసరావు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, దేవుని ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తో పాటు అడుగు పెట్టాలని ఆయన కోరారు.