అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది: గురాన అయ్యలు

విజయనగరం: అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. ఆదివారం హుకుంపేటలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా వినాయక మండపంలో గణనాధునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందని, వీధుల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. యువత సామాజిక అవగాహన కలిగి ఉండాలని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో యువత సరైన నాయకుడికి మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువత ముందడుగు వేస్తే విజయమే తప్ప అపజయము అనే మాట ఉండబోదని వెల్లడించారు. యువతకు తన సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు, స్థానికులు మణి, కిరణ్, మధు, తరుణ్, బాలు, చెక్రి, రవి, వెంకటేష్, జాఫర్, దినకర్, శ్యామ్, మౌళి, పండు, గణేష్, జనసైనికులు ఎం.పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, సాయి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.