ఓటమి భయంతోనే మంగళగిరి జనసేన కార్యాలయ సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు

  • సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు అత్యంత హేయమైన చర్య
  • జనసేన పార్టీ కదిరి ఇంచార్జీ భైరవ ప్రసాద్

కదిరి: జగన్ రెడ్డికి అన్నీ వ్యతిరేక దిశల్లో జరుగుతున్నాయి. ఒక పక్క జగన్ అన్న వదిలిన బాణం షర్మిల పోటు, సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గొడ్డలి పోటు కేసు, తెలుగు దేశం, జనసేన పార్టీకి పొత్తు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేక, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేల్లో ఓటమి పాలు అవుతున్నాం అనే మానసిక ఒత్తిడిలో అసహనంతో ఏం చెయ్యాలో దిక్కు తోచక నిన్నటి రోజు ఈ జగన్ రెడ్డి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజా స్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న సిబ్బందిని విచారించడం, వ్యక్తిగత గదుల వివరాలు సేకరించడం వంటి హేయమైన చర్యకు పాల్పడ్డాడు. అయ్యా..!! జగన్ రెడ్డి నువ్వు ఆకస్మిక తనిఖీలు చెయ్యాల్సింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కాదు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై, మంత్రులపై, ఎంపీలపై ఎందుకంటే దాదాపుగా మీరు ప్రకటించిన సీట్లల్లో 150 మందికి పైగా గుండాలు, రౌడీలు, ఎర్ర చందనం దొంగలు, గంజాయి స్మగ్లర్లు, హంతకులు, ఆర్థిక నేరస్థులు ఉన్నారు. నీతో సహా ఏదో జనసేన పార్టీ పై, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై బురద చల్లాలి అని మీ పెయిడ్ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని పార్టీ కార్యాలయంలో గంజాయి, కొకైన్, వంటి మత్తు పదార్థాలు మీరే అక్కడి పెట్టేసి జనసేన పార్టీ కార్యాలయం సిబ్బందిని భయబ్రాంతులకు గురి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నారు అది కుదరదు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా నాల్గవ పెళ్ళాం నువ్వే అన్నట్లుగా నీ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలి కలుగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 40 రోజుల్లో మీరు ఓడిపోవడం ఖాయమని చర్యకు ప్రతి చర్య తప్పదు ప్రతి దానికి మీరు సమాధానం చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. రాబోయేది జనసేన, తెలుగు దేశం ఉమ్మడి ప్రభుత్వమే కావున పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగస్తులు రాజకీయ నాయకుల చేతుల్లో బలికాకండి అని జనసేన పార్టీ ఇంచార్జీ భైరవప్రసాద్ గారు పత్రికా ముఖంగా తెలిజేసారు. ఈ మీడియా సమావేశంలో కదిరి పట్టణ అధ్యక్షుడు కాయల చలపతి, ఉపాధ్యక్షులు, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ప్రధాన కార్యదర్శి వానిల్లి అంజిబాబు, నల్ల చెరువు మండల కన్వీనర్ సాకే రవి కుమార్, పెద్ద గోవిందు రెడ్డెప్ప, అరవింద్, వెంకట రమణ పాల్గొన్నారు.