అంబటి కాపుల గుండెల్లో కుంపటి: వై శ్రీనివాస్

  • కష్టార్జితాన్ని ప్రజల కోసం పంచుతున్న పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అంబటికి లేదు
  • ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేకే వ్యక్తిగత విమర్శలు
  • లేఖలు రాసి రాజకీయాలు చేస్తే నమ్మే స్థితిలో కాపులు లేరు
  • అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై. శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక స్థాయి అంబటికి లేదంటూ వ్యాఖ్యానించారు. రాత్రి పగలు కష్టపడి సంపాదించిన తన కష్టార్జితాన్ని కౌలు రైతులకు ఇచ్చి తన వంతు బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ ను చనిపోయిన పేద కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చిన ఐదు లక్షల రూపాయలలో రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నువ్వా మా అధినేతను విమర్శించేదంటూ ఘాటుగా బదులిచ్చారు. రాజకీయ పదవులు అనుభవిస్తున్నంత మాత్రాన గతాన్ని మర్చిపోకూడదని అంబటి రాంబాబు తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణి ఆహ్వానించేందుకు కాళ్ళు అరిగేలా తిరిగిన సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాపులకున్న ఐదు శాతం రిజర్వేషన్ తొలగిస్తే దానిపై కాపుల తరఫున మాట్లాడడానికి ఎందుకు ముందుకు రాలేదన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన కాపు కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేనప్పుడు, కాపుల విదేశీ విద్య నిమిత్తం పది లక్షల రూపాయల సాయం ఆపినప్పుడు, కాపు మహిళల స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం నిలిపివేసినప్పుడు,కాపులకు లబ్ధి చేకూర్చే ఇతర సంక్షేమ పథకాలు నిలిపివేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో జగన్ రెడ్డి క్యాబినెట్లోని కాపుమంత్రులు కాపులకు సమాధానం చెప్పాలన్నారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లిలో జనసేన పార్టీ గాజు గ్లాసు నాకు గుండెల్లో గుణపమై గుచ్చుకుంటుందని, పవన్ కళ్యాణ్ ఇక్కడనుండి పోటీ చేయడం లేదు కాబట్టి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనీ లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఇంటింటికి వెళ్లి బ్రతిమిలాడుకుని ఓట్లు అడిగిన నీకు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఉందని ఎలా అనుకున్నావని అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నేటి వరకు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై మాట్లాడేందుకు అవగాహన, సమయం లేని అంబటికి సుకన్య, సంజనలతో కబుర్లు చెప్పడానికి మాత్రం సమయం ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తరఫున పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని చేతకాని మంత్రిగా అంబటి రాంబాబు పేరు పొందారని అన్నారు. నిజంగా వైసిపి నాయకులు అంత దమ్ముంటే ప్రజల పక్షాన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి జామీ సత్యనారాయణ మాట్లాడుతూ అంబటి రాంబాబు చెప్పినట్లే రెండు చోట్ల గెలవక పోయినా అత్యంత సమర్థవంతంగా ప్రజల పక్షాన గెలుపోవటములతో సంబంధం లేకుండా జనసేన పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను ముచ్చమటలు పట్టించే విధంగా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పడం చేతకాక కేవలం వ్యక్తిగత విమర్శలతో వై.సి.పి నేతలు పబ్బం గడుపుతున్నారని తెలిపారు. ఒక అపజాతి నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీకి నిలబడుతుంటే ఒక కాపు జాతీయుడుగా స్వాగతించడం మాని జగన్ రెడ్డి మెప్పు కోసం జాతికి అన్యాయం చేయడం తగదని అన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేయకుండా లేఖలు రాసి కుటుంబ ప్రయోజనాలు పొందాలని చూస్తే నమ్మేసతులు కాపజాత లేదని పరోక్షంగా ముద్రగడ పద్మనాభందేశించి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమను కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, జనసేన సీనియర్ నాయకులు, వాసం త్రిమూర్తులు, నగరనాయకులు సురేష్ నాయుడు, ఆసూరి సుధాకర్, రామకృష్ణ భగవన్ తదితరులు పాల్గొన్నారు.