అంబటి రాంబాబు అసందర్భ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పులి హరి

బుధవారం మాచర్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మాచర్ల లో 50 పడకల హాస్పిటల్ ఓపెనింగ్ సభలో మంత్రి అంబటి రాంబాబు అసందర్భ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కార్యదర్శి పులి హరి మాచర్ల జనసేన పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతూ అంబటి రాంబాబు మీరు నిన్న సభలో పవన్ కళ్యాణ్ పై కొన్ని అసందర్భ వ్యాఖ్యల ను జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాము. అంబటి మీరు వరికపూడి శాలను ఎన్ని సార్లు వెళ్లి చూస్తారు. ఒక్క ఇటుక అయినా వేశారా. పూర్తి చేయడం చేతకాదు ఎప్పుడు చేస్తారో కూడా చెప్ప లేరు మీరా పవన్ కళ్యాణ్ ని విమర్శించేది. మీకు తెలిసింది గంట అరగంట కానీ మా నాయకుడికి ప్రజలు అంటే పిచ్చి ఆయనకు రైతుల అంటే పిచ్చి తన సొంత కష్టార్జితం తో రైతులకు సహాయం చేసాడు. నీ చరిత్ర యేంటో అందరికీ తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సహించబోమని మాచర్ల జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పులి హరి, మండల అధ్యక్షులు సాంబశివరావు, కొమర లాలా, రాంప్రకాష్, వెండి నాగేశేషయ్య పాల్గొన్నారు.