తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ యావత్ భారత దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలు స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్ ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, మొలుగూరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.