అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయం: రాటాల రామయ్య

రాజంపేట, సిద్ధవటం ఏప్రిల్ అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని రాటాల రామయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన అంటరాని, అణగారిన వర్గాలు రాజ్యాంగం రచించడంలో అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను గౌరవిస్తూ, రాజకీయ పార్టీలు నడుపుతున్న కొద్దిమంది నాయకుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుంటారన్నారు. అణగారిన వర్గాలు ఇప్పటివరకు రాజ్యాధికారం పొందని వర్గాలకు మంచి జరగాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే మంచి జరుగుతుందన్నారు. అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కులమత ప్రాంతాలకతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ ముందుకు తీసుకెళుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరిహు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.