ఎమ్మిగనూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

ఎమ్మిగనూరు, జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 67 వ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాసా రవి ప్రకాష్, కర్ణం రవి, రాహుల్ సాగర్, బజారి మాట్లాడుతూ ఆస్తమించని సూర్యుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్.బి.ఆర్. అంబేద్కర్ అని, భారతదేశం కోసం బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ పరశురాం, నరేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.