ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తడంతో  శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్ )కు తరలించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ముందు కూడా షా పోస్ట్- కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు. కాగా అమిత్ షా ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. తిరిగి 4 రోజుల్లో ఆగస్టు 18న పోస్ట్- కోవిడ్ కేర్ కోసం తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ఆసుపత్రి నుంచే తన మంత్రిత్వశాఖ పనులను నిర్వహించారు.