ఏండ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని ఇండోర్ స్టేడియం

  • హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు  తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం: నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తగరపు శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలుగా క్రీడాకారులు ఎదురు చూస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా తాళాలు వేసి ఉండడంతో, క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వెంటనే ప్రారంభించాలని, క్రీడాకారులకు సేవలు అందించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వొద్దమల్ల విజయ్, తోడేటి సంపత్, సోషల్ మీడియా సెక్రెటరీ రెడ్డి గోపినాథ్, పొడిశెట్టి విజయ్, కల్లెపు అజయ్, చెల్పూరి వినోద్, మొలుగూరి అరవింద్, కిషన్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.