తూర్పు గానుగూడెం గ్రామంలో వైస్సార్సీపీకి కోలుకోలేని దెబ్బ

  • సీనియర్ నాయకులు అబ్బిరెడ్డి వెంకటేశ్వరరావు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా
  • వరుస చేరికలతో దూసుకుపోతున్న జనసేన

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, తూర్పు గానుగూడెం గ్రామంలో అధికార వైస్సార్సీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ జిల్లా సేవాదళ్ కార్యదర్శి అబ్బిరెడ్డి వెంకటేశ్వర రావు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాగరపు సురేష్, గండి విజయ్ కుమార్, చెలగల బుల్లదొరతో పాటుగా మరొక 20 మంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి… రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బత్తుల. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.