అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: అంకె ఈశ్వరయ్య

తాడిపత్రి నియోజకవర్గం, పెద్దవడుగూరు మండలం, గోపురాజు పల్లి గ్రామంలో వర్షాభావం వలన ఎండిపోతున్నటువంటి పంటలను రైతులతో పాటు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య సందర్శించడం జరిగింది. రైతులు అప్పులు తెచ్చి వేరుశనగ పంట , పత్తి పంటలను వేసిన సందర్భంలో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి కనీసం కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేక వేసిన పంట నుంచి కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాకోకుండా ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని, అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వలేక పంటలన్ని ఎండిపోతున్న తరుణంలో ఆత్మహత్యే శరణ్యమని రైతులు వారి బాధలను అంకె ఈశ్వరయ్య గారి వివరించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వైసిపి ప్రభుత్వం గడపగడపకు అని ప్రజలకు మేలు చేశామని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు గ్రామాలలో రైతులు వేసినటువంటి పంటలను ఒకసారి పరిశీలించాలన్నారు, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో వారికి భరోసా కల్పించే రకంగా మద్దతు సాయం ప్రకటించాలని ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించాలని, విత్తనాలు, మందులకు గాని ప్రభుత్వమే రైతులకు సబ్సిడీ రూపంలో అందించాలని జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి అనంతపురం జిల్లా ప్రజలను రైతులను ఆదుకోవాలని రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం ఆదుకునే రకంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన జనసేన పార్టీ మద్దతుగా పోరాటం చేస్తామని, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నాయకురాలు శశిరేఖ, పెద్దవడుగూరు మండల అధ్యక్షులు దూద్ వలి, రైతులు పుల్లయ్య, ఓబులేసు, ఆదినారాయణ, నాగేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.