ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ చీకటి జీవో 1

రైల్వేకోడూరు, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలను కలుసుకునేందుకు వీలు లేకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర అడ్డుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ చీకటి జీవో 1 తెచ్చిందని రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గెలుపొంది సీఎం కాకుండా అడ్డుకోవడం కోసం జగన్, కేసీఆర్ డైరెక్షన్ లో కుట్రలు చేయడం సిగ్గుచేటు అని దినకర్ బాబు ఒక ప్రకటనలో ఆరోపించారు. బి.ఆర్.ఎస్ లో ఏపీ నేతలు చేరడానికి జగన్ కారణం అని, తెలంగాణలో ఉన్న అక్రమ ఆస్తులను కాపాడుకోవాలని జగన్ పనిచేస్తున్నారని, 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఆర్థిక సహాయంతో జగన్ విజయం సాధించడం జరిగిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం లేదని చెప్పడం అంటే కేసీఆర్ కు జగన్ కట్టు బానిస అని నిరూపిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు, కేసీఆర్ ఆర్థిక సహాయంతోనే జగన్ గెలిచారని, 2024 ఎన్నికల్లో ఓటుకు 10 వేల రూపాయలు ఇచ్చిన జగన్ విజయం అసాధ్యమని దినకర్ బాబు పేర్కొన్నారు. కేసీఆర్, జగన్ లు ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు సామాజిక న్యాయం కోసం పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన లక్ష కోట్లను కేసీఆర్‌కు జగన్ ధారదత్తం చేశాడని, పోలవరం ప్రాజెక్ట్ మరియూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి.. కేసీఆర్, జగన్ ల బినామీ అని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికలలో జనసేన పార్టీ గెలుపొందడం ఖాయమని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజ్యాధికారం అంది వచ్చే ఈ తరుణంలో జనసైనికులు వీర మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి చీకటి జీవోల ద్వారా ఎమర్జెన్సీ పరిస్థితిని తీసుకొచ్చారని దినకర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.