ఆర్ధికసాయంతో మనోధైర్యాన్నిచ్చిన అనంతపురం జనసైనికులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, కమలపాడు గ్రామంలో మెగా ఫ్యామిలీ అభిమాని జనసేన పార్టీకి చెందిన కేశవ్ కి సంబంధించిన గుడిసె మంగళవారం అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో నిప్పు అంటించారు ఈ విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ జనసైనికులు, ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్ర, విదపనకల్ మండల అధ్యక్షులు గోపాల్, అమిధ్యాల అజయ్ లు తక్షణ సాయం కింద 10వేల రూపాయలను అందించారు. వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ నిత్యావసర సరుకుల అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ కి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ కి ఫోన్ ద్వారా వివరాలు తెలియచేశారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.