రైతు భరోసా యాత్ర గోడప్రతులను ఆవిష్కరించిన అనంతపురం జనసేన

అనంతపురం అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసేందుకు అనంతపురం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్ నందు ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో వీరమహిళలు మారిశెట్టి రూప, కళ్యాణదుర్గం యస్.తార, రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బోయ మీనాక్షి శ్రీమతి ఏ.భవాని, నగర కమిటీ కార్యదర్శి శ్రీమతి పద్మావతి లు రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించి.. అనంతరం వివిధ చోట్ల గోడ పత్రికలను అతికించారు. ఈ సందర్భంగా వీర మహిళలు రూప మరియు శ్రీమతి. ఎస్.తార లు మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన కౌలు రైతుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన రైతు భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రియాశీలక సభ్యత్వం 5లక్షల ప్రమాద భీమా కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ధ్యేయంగా పని చేయాలని అలాగే అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ నాయకత్వాన్ని బలపరిచి ముందుకు తీసుకువెళ్లాలని నాయకులకు మరియు జనసైనికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నాయకులు పవనిజం రాజు, చంద్రశేఖర్, ధనురామ్, మల్లి, అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది.