కొయ్యలగూడెంలో జనంకోసం జనసేన 71వ రోజు

పోలవరం, కొయ్యలగూడెం మండలం, కొయ్యలగూడెం పట్టణంలో 71 వ రోజు మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో జనంకోసం జనసేన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రతి ఇంటికి, ప్రతి షాప్ కి వెళ్లి అందర్నీ పలకరించుకంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ కొయ్యలగూడెం పట్టణం ఏజెన్సీకి ముఖద్వారం లాంటిది. అలాంటి పట్టణంలో నేడు అభివృద్ధి అనేదే కరువయ్యింది, కనీసం డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదు, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 20 సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నారు. కానీ ఎప్పటినుంచో అడుగుతున్నా డిగ్రీ కళాశాల మన అందరికి చిరకాల స్వప్నంగా మిగిలిపోయిందని, అగ్నిమాపాక కేంద్రం కూడా అందని ద్రాక్షలా మారిపోయిందని, పోలీస్ స్టేషన్ వద్ద ఒక కాంప్లెక్స్ కట్టి ఇస్తామని ఎలక్షన్స్ సమయంలో చెప్పి ఇప్పటి వరకు వాటి ప్రస్తావన తీసుకురాలేదని, సుమారు 30 పడకల ఆసుపత్రిని నేడు 16 పడకల ఆసుపత్రి మార్చడం ఎంతవరకు న్యాయం అని చిర్రి బాలరాజు మండిపడ్డారు. ఇదేనా అభివృద్ధి అంటే? ఇదా పాలన అంటే? ఏంచేసారని మా నమ్మకం నువ్వే జగన్ అని అనుకోవాలి? ఆయన ప్రశ్నించారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో జిల్లా నాయకులు పాదం కృష్ణ, పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, ఉపాధ్యక్షులు మధు కన్నయ్య, రామకృష్ణ, వీరయ్య, బొలిశెట్టి శ్రీనివాస్, బొలిశెట్టి సూరిబాబు, జగ్గా రాజు, అప్పలరాజు, నక్క రాము తదితర జనసైనికులు పాల్గొన్నారు.