టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనిల భాదితుల తరుపున అనంతపురము జనసేన గళం

జగనన్న ఇళ్లు – పేద ప్రజల కన్నీళ్లు ..

అనంతపురము: జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు మొదటి రోజులో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొదటి రోజులో భాగంగా అనంతపురం రూరల్ లోని కొడిమి గ్రామంలో జగనన్న కాలనీలను సందర్శించిన అనంతరం జిల్లా అధ్యక్షులు & అర్బన్ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ టిడ్కో ఇల్లు పూర్తయి మూడున్నర సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు వాటిని అప్పగించలేదన్నారు. నివాసాలకు ఏ మాత్రం ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందులో మొదటి రోజులో భాగంగా పరిధిలో గృహ నిర్మాణ పథకాలు జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలించారు. ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రతి అంశాన్ని మరియు జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్యపై జనసేన ప్రజల దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని డిమాండ్ చేశారు. అలాగే కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రదాన కార్యదర్శి భవాని రవికుమార్, మరియు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, వీరమహిళలు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.