చెన్నూరు గ్రామంలో పర్యటించిన పెడన జనసేన నాయకులు

పెడన నియోజకవర్గం, పెడన మండలం, చెన్నూరు గ్రామంలో ఎస్టి(యానాదులు) సోదరులు గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించి, గణపతి నిమజ్జనం రోజున అత్యంత వైభవంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ యొక్క మోటివేషనల్ స్పీచ్ లతో ఆధ్యాంతము ఆ గణనాధునిపై భక్తితో, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో నిర్వహించిన కార్యక్రమం సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ విషయాన్ని తెలుసుకుని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సోమవారం చెన్నూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ సందర్శించి వాళ్ళను అభినందించడం జరిగింది. జనసేన నాయకులకు ఎస్టి సోదరులు ప్రేమతో స్వాగతం పలికారు. తదుపరి జనసేన నాయకులు కాలనీ సమస్యల గురించి తెలుసుకొనుటకు కాలనీలో తిరగడం జరిగింది. చెన్నూరు ఎస్ట్(యానాదుల) కాలనీకి సరైన రోడ్డు మార్గం లేదు. మంచినీటి సౌకర్యం కాదు. ఎన్నికల సమయంలో మాత్రమే మా కాలనీకి రాజకీయ నాయకులు వస్తారని, నెరవేర్చని హామీలు ఇచ్చి వెళతారని కాలనీవాసులు చెప్పడం జరిగింది. ఆ కాలనీలో సుమారు 30 కుటుంబాలు కేవలం ఏడు ఇళ్ళల్లో జీవిస్తున్నారు. ఒక్కొ ఇంటిలో మూడు కుటుంబాలు వరకు నివాసం ఉంటున్నారు. గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి జోగి రమేష్ మాది పేదల ప్రభుత్వం. 30 లక్షల గృహాలను ఆంధ్ర రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు జగనన్న కట్టిస్తున్నారని ఉకదంపుడు ఉపన్యాసాలు చెబుతారు. మంత్రి నియోజకవర్గంలోనే 30 కుటుంబాలు కేవలం ఏడు ఇళ్లలో నివసిస్తున్న విషయం మంత్రికి తెలియదా? అదే కాలనీకి చెందిన చెట్టు రాజారావు (1945లో పుట్టిన) అనే వృద్ధుడికి పెన్షన్ రావడం లేదు. ఈ విషయం కూడా మంత్రి దృష్టికి రాలేదా? పెళ్ళి దుస్తుల వేషధారణలో, హాస్పటల్లో ఉన్న పేషెంట్లకు కూడా ఆస్పత్రికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చే వాలంటరీ వ్యవస్థ చెన్నూరులో పనిచేయడం లేదా? చెన్నూరు ఎస్టి(యానాదుల) కాలనీకి సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేగా కం మంత్రి అయిన జోగి రమేష్ వెంటనే స్పందించి వారి సమస్యలు తీర్చవలసిందిగా జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా ఎస్ వి బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి దేవేందర్, సీట్ల నవీన్ కుమార్, బత్తిన నరేష్, పినిశెట్టి రాజు, పుప్పాల పాండురంగారావు, పుప్పాల సుబ్బారావు, పాశ్యం ‌నాగమల్లేశ్వరరావు, కాజా మణికంఠ, ముద్ధినేని రామకృష్ణ, కనపర్తి వెంకన్న, మర్రె సీతారాం, నల్లమోతు అశోక్ (నాని), యర్రంశెట్టి రాము, యర్రంశెట్టి రేకేష్ పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.