రంజాన్ తోఫా ఇచ్చిన అనంతసాగరం జనసేన

అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు పడమటి ఖమ్మంపాడు పంచాయతీలోని అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో 15 పేద ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా (కానుక) నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షేక్ మస్తాన్ మరియు అనంతసాగరం మండల ప్రధాన కార్యదర్శి షేక్ సైఫుల్లా, మండల కార్యదర్శులు గంగుల పెంచల రావు, హరీష్ పాల్గొనడం జరిగింది.