డాక్టర్ లేని అనంతగిరి హాస్పిటల్: డి నవీన్ కుమార్

*మధ్యాహ్నం ఒంటిగంట అయినా డాక్టర్స్ రాలేని పరిస్థితి.. జ్వరాలతో బాధపడుతున్న మండల కేంద్ర ప్రజలు.. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డి నవీన్ కుమార్ ఆరోపణ.

జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో 1)డాక్టర్ అనూష రావు నిర్లక్ష్యం వల్ల తప్పుడు రిపోర్టులు 2) బర్త్ సర్టిఫికెట్ కోసం పది రోజులు తిప్పుతున్నారు 3)గర్భిణీ స్త్రీలకు భోజనం సదుపాయం కలగజేయడం లేదు కానీ నెలకు బిల్లు మాత్రము టైంకు అందుతుంది.. అని కొంతమంది ప్రజలు జనసేన టీంకు తెలియజేశారు. మండల కేంద్రంలోనే.. ఇలా జరిగితే మిగతా చిన్న చిన్న హాస్పటల్ పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన అన్నారు.. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.. లేని ఎడల న్యాయం జరిగే వరకూ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమానికి సిద్ధమవుతామని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సామాన్య కమిటీ సభ్యులు కొర్రా ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షులు సిహెచ్ మురళి, మండల నాయకులు రమేష్, మంగళ, వీర మహిళ రత్నప్రియ పాల్గొన్నారు.