రాష్ట్ర ప్రజల తల రాతలను మార్చే ఏకైక నాయకుడు జనసేనానే: బండారు శ్రీనివాస్!

*మండపేట పట్టణానికి16న కౌలు రైతు భరోసా యాత్రకు జనసేనాని వస్తున్నాడు!
*చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు అండగా నేను ఉన్నాననే భరోసా యాత్ర!
*ఆలమూరు గ్రామం సమావేశంలో ఏర్పాట్లపై కోఆర్డినేటర్లతో చర్చించిన జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్!

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలం నందు సోమవారం ఆలమూరు గ్రామంలో జనసేన పార్టీ మీటింగ్ జరిగినది. మండపేటకు రేపు 16న జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర పర్యటన సందర్భంగా, ఆరోజు ఏర్పాటుపై ప్రత్యేక సమావేశంలో, ఈనెల 16వ తారీఖున పలు కార్యక్రమాలు కొరకు దిశానిర్దేశం చేయడానికి.. పలువురు కోఆర్డినేటర్లు ఇన్చార్జులు, జిల్లా కార్యదర్శులతో ఆలమూరు గ్రామంలో సమావేశమైన బండారు శ్రీనివాస్.. ఈ నెల 16న మండపేట పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభ కార్యక్రమంనకు తగు సూచనలు, సలహాలు చేసి యున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖ నాయకులు అనపర్తి నియోజకవర్గం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గము ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర, వీర మహిళ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి, కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీను, మరియు ఆలమూరు మండల ప్రముఖ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, జిల్లా కార్యదర్శలు దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, సంగీత సుభాష్ మరియు ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపరెడ్డి సత్య, రావులపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట స్వామి, ఆత్రేయపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, కొత్తపేట మండల జనసేన పార్టీ వైస్ అధ్యక్షులు చింతపల్లి సత్తిపండు, ప్రముఖ సీనియర్ నాయకులు మహాదశ బాబులు, తులా రాజు, మడికి ఎంపిటిసి ఉండ్రాజపు వెంకన్న, చొప్పెల్ల ఎంపీటీసీ జాంపోలు నాగేశ్వరరావు, పినపల్ల ఎంపీటీసీ పెద్దిరెడ్డి పట్టాభి, చెముడు లంక ఎంపీటీసీ తమ్మన భాస్కరరావు, బడుగు వానిలంక ఎంపీటీసీ పడాల అమ్మిరాజు దంపతులు, సందిపూడి సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు దంపతులు, మూలస్థానం సర్పంచ్ లంకే వరప్రసాద్, మూలస్థానం ఎంపీటీసీ బావిశెట్టి తాతాజీ, కొనగళ్ల ధనరాజ్ నాయుడు, మూలస్థానం ప్రముఖ యువ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ (జెపి) ప్రముఖ సీనియర్ నాయకులు కొత్తపల్లి నగేష్, గారపాటి త్రిమూర్తులు, చింతలపూడి శ్రీనివాస్, జొన్నాడ గ్రామ జనసేన అధ్యక్షులు చెల్లె రాజశేఖర్, ఆలమూరు గ్రామ జనసేన అధ్యక్షులు కట్టా రాజు, చల్లా వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి మహేష్, కోట వరలక్ష్మి, మీడియా ప్రతినిధి బైరిశెట్టి రాంబాబు. పలువురు జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు.