అనంత వెంకట్రామిరెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎక్కడ?

  • నగరమంత చెత్తమయం ఔతున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టవా
  • నగరమంతా పారిశుధ్యం దెబ్బతిని ప్రజలు అనారోగ్యానికి గురైయ్యే ప్రమాదం ఉన్నది
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: సోమవారం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని స్థానిక రెండవ డివిజన్ వినాయక నగర్ లో పర్యటించి ప్రజలతో మమేకమై అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక వినాయక నగర్ లో మురుగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని రోడ్లపై ఎక్కడ చూసినా మురుగునీరు ప్రవహిస్తుందని అనంత వెంకట్రామిరెడ్డి 2019 ఎన్నికల వాగ్దానాలలో భాగంగా నగరానికి అంతర్భాగ డ్రైనేజీని తీసుకొస్తానన్నాడని అధికారంలోకి వచ్చి 5సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఆ వైపు అడుగులు వేయలేదనిఅంటూ దీనికి తోడు పారిశుద్ధ కార్మికుల సమ్మెతో కాలనీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి కాలనీలో దుర్వాసనతో ప్రజారోగ్యం దెబ్బ తినే పరిస్థితులు ఉన్నాయని వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు నెరవేర్చలని లేని యెడల జనసేన టిడిపి ప్రభుత్వం స్థాపనతో వారి సమస్యలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.