జనసేనాని ప్రవేశపెట్టిన జన సైనికులకు అండ క్రియాశీలక సభ్యత్వం

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశానుసారం గొల్లప్రోలు మండలాలలో దుర్గాడ, ఏ.వీ నగరం, గ్రామాలలో మండల అధ్యక్షులు అమరాది వల్లీ రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం యొక్క ఉపయోగాలు పార్టీ యొక్క సిద్ధాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కోసం కృషి చేసే ప్రతి జనసైనికుడిని గుర్తించి సభ్యత్వం చేయాలని ఆ గ్రామాల్లో నాయకులు జనసైనికులకు తెలియజేశారు. అలాగే గొప్ప మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ని ప్రతి జనసైనికుడికి అండగా ఈ విధంగా భరోసా ఇస్తూ జనసైనికులపై ఉన్న ప్రేమ తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, మొగలి శ్రీనివాస్, పెనుకొండ వెంకటేశ్వరరావు, శివకోటి అచ్చా రావు, గ్రామ నాయకులు కార్యకర్తలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.