వీఆర్ఎ ల డిమాండ్లకు మద్దతుగా జనసేన వంటావార్పు

నూజివీడు, గ్రామ రెవెన్యూ సేవకుల(వీఆర్ఎ) న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నూజివీడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వంటావార్పు కార్యక్రమానికి జనసేన పార్టీ తరుపున మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో వంట చేయటం జరిగింది. వీఆర్ఏల తో కలిసి నిరసన దీక్ష కార్యక్రమంలోనే భోజనాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని జనసేన పార్టీ నాయకులు ఎండగట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల కామేష్, జనసేన పార్టీ నాయకులు ఏనుగుల చక్రధర్(చక్రి), నూజివీడు జనసేన పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మిమ్మల్నిలేని సునీల్ కుమార్, ఇంటూరి చంటి, అజరెైపేట పవన్ తదితరులు పాల్గొన్నారు.